Manipur: |మణిపూర్‌లో అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మే 3న రెండు తెగల మధ్య ఘర్షణలతో ప్రారంభమైన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్‌లో ఘర్షణలను నివారించడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ స్వయంగా తానే 4 రోజులపాటు రాష్ర్టంలో మకాం వేసి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించారు. ఆ తరువాత మళ్లీ అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రావణకాష్టంలాగా కాలుతూనే ఉంది. బుధవారం రాష్ట్ర మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్‌ఇంటిపై దాడిచేశారు.
Read also: Viral: ఆదిపురుష్ సినిమాకు అతిథిగా వచ్చిన హనుమంతుడు
రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లో కర్ఫూ విధించడానికి నిరసిస్తూ ఆందోళనకారులు గురువారం రాత్రి కోంగ్బా ప్రాంతంలో ఉన్న కేంద్ర మంత్రి రంజన్ సింగ్ నివాసాన్ని చుట్టుముట్టారు. సుమారు 1200 మంది ఆందోళనకారులు కేంద్ర మంత్రి ఇంటిపై దాడికి వెళ్లారు. ఇంటిపై పెట్రో బాంబులు విసిరారు. దీంతో ఇల్లు కాలిపోయింది. అయితే ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని పోలీసులు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆందోళనకారులు మంత్రి ఇంటిపై దాడిచేయడానికి చుట్టుముట్టగా.. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. కానీ గురువారం రాత్రి జరిగిన దాడిని మాత్రం అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ దినేశ్వర్ సింగ్ చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత సుమారు 1200 మంది మంత్రి ఇంటిని చుట్టుముట్టారని, అన్ని వైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరారని తెలిపారు. ఆ సమయంలో ఐదుగురు సెక్కూరిటీ గార్డులు, తొమ్మిది మంది భద్రత సిబ్బంది, మరో ఎనిమిదిమంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
Read also: Whatsapp: వాట్సాప్ ‘వాబీటా’ ఫీచర్.. ఒక్క యాప్‌లోనే వేర్వేరు అకౌంట్లు!
మణిపూర్ రాష్ట్రంలో మే 3న రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మైటీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నాగాలు, కుకీ సామాజికవర్గానికి చెందినవారు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో దాదాపు 120మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 350మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. 50వేలమందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.