మణిపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ పై అల్లరిమూక నిప్పు పెట్టారు.. ఈ దారుణ సంఘటనలో చిన్నారితో సహా మరో ముగ్గురు సజీవదహనం అయ్యారు.. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిలో మీనా హాంసింగ్, ఆమె కుమారుడు టోన్సింగ్, వారి బంధువు లిడియా ఉన్నారు. వీరు అస్సాం రైఫిల్స్ రిలీఫ్ క్యాంపులో ఉంటున్నారు. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుండటంతో వీరు గత కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే ఉంటున్నారు..
అయితే ఎనిమిదేళ్ల బాలుడు టోన్సింగ్ తోటి పిల్లల తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో తుపాకీ శబ్దం వినిపించింది. తుపాకీ నుంచి వచ్చిన తూటా బాలుడి తలకు తగిలింది. ఇది గమనించిన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. బాలుడికి బులెట్ తగలడంతో తల్లి తల్లడిల్లింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమైన అంబులెన్సుని పిలించి అందులో చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాలు కొంతదూరం రాగా, ఆ తరువాత మణిపూర్ పోలీసులకు బాధ్యతను అప్పగించారు… అయితే హాస్పిటల్ సమీపంలోకి రాగానే అల్లరిమూకలు అంబులెన్సు కు నిప్పాంటించారు..
గాలి వేగంగా వీస్తుండటంతో అంబులెన్సుకు మంటలు వ్యాపించాయి.. ఈ ఘటనలో అంబులెన్సు సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడగా.. హాంసింగ్, టోన్సింగ్, లిండియా ముగ్గురు మంటల్లోనే అంబులెన్సులో సజీవదహనం అయ్యారు. కాంగ్‌చుప్ ప్రాంతం లో అనేక కుకీ గ్రామాలు ఉన్నాయి. ఇది ఇంఫాల్ వెస్ట్‌తో కాంగ్‌పోక్పి జిల్లా సరిహద్దులో ఉంది. ఇది ఫాయోంగ్‌లోని మెయిటీ గ్రామానికి దగ్గరగా ఉంది. మే 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దఫా హింసాకాండ లో ఈ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి.. మే3 న కొండ జిల్లా లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఆ తరువాత ఈ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..