మణిపూర్ రాష్ట్రంలో హింసాకాండ గత 45 రోజులుగా ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడంపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది. అయితే ఈ పరిష్కార మార్గాల్లో రాష్ట్రపతి పాలన అనేది తమ చిట్టచివరి ఆప్షన్ గా ఉంటుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అందుబాటులో ఉన్న మిగితా ఆప్షన్లను అమలు చేసేందుకే కేంద్రం మొగ్గు చూపొచ్చని కమలం పార్టీ నేతలు అంటున్నారు. ఈక్రమంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్‌ను ఆ పదవిలో కొనసాగించాలా ? వద్దా ? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం డైలమాలో ఉందనే టాక్ వినిపిస్తోంది.
Read Also: PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
ఒకవేళ బీరేన్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పిస్తే.. రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మణిపూర్ లో మళ్ళీ సాయుధ దళాలు ప్రత్యేక అధికారాల చట్టం వంటివి అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో AFSPA చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాలలో అమలు నుంచి వెనక్కి తీసుకోవడానికి కేంద్రం ఎంతో చెమటోడ్చింది. అందుకే మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితులను కేంద్రం రిపీట్ చేయకపోవచ్చు అని తెలుస్తుంది.
Read Also: Children: పిల్లలు చురుగ్గా ఉండేందుకు ఈ ఆసనాలను నేర్పించండి
అయితే, రాష్ట్రపతి పాలనను చిట్టచివరి ఆప్షన్ గా పెట్టుకున్నందున.. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తొలగింపు అనే రిస్కీ నిర్ణయాన్ని కేంద్రం తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీరేన్ సింగ్‌ను సీఎం సీటు నుంచి తప్పిస్తే .. మణిపూర్ లో 50 శాతానికిపైగా ఓటర్లున్న మైటీ తెగ బీజేపీ పార్టీకి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన కంటే ఇతరత్రా ఆప్షన్స్ లో బెస్ట్ వి ఇంకా ఏవైనా ఉంటే వాటిని కేంద్రం ఫాలో అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.