Manipur: మణిపూర్‌లో జరిగిన దారుణానికి దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఇద్దరు మహిళలతో బహిరంగంగా అసభ్యంగా ప్రవర్తించిన ప్రధాన నిందితుడి ఇంటికి అతని స్వంత గ్రామస్తులు నిప్పు పెట్టారు.
మణిపూర్ అల్లర్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ డివిజన్ కేంద్రంలో నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు.
Supreme Court: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మణిపూర్‌లో జరిగిన దారుణ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది 140కోట్ల మంది భారతీయులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనగా అభివర్ణించారు.
Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ తుఫానుగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
Manipur Violence: రెండు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండలో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ రచ్చకెక్కింది. అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన శ్రీకోనా బెటాలియన్ సుమారు 2 కోట్ల విలువైన హెరాయిన్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుంది.
మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాత్మకమైన ఘటనలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హింసను మరింత పెంచేందుకు తమను వాడుకోవద్దని సుప్రీంకోర్టు కోరింది. ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని తాము పర్యవేక్షిస్తామని, మరిన్ని చర్యలకు అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు.. అంతేకానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది.
జాతి హింసకు గురైన రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని మణిపూర్ హైకోర్టు ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మణిపూర్‌లో హింసాకాండ ఎంతకి ఆగడం లేదు. స్కూల్స్ తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.