Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మణిపూర్‌లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. 15 రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్రం మళ్లీ అగ్గి రాజుకుంది. చివరిసారి ఆగస్టు 5న వేర్వేరు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలో ఐదుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు మీతీ తెగకు చెందినవారు కాగా మరో ఇద్దరు కుకీ తెగకు చెందినవారు. మే 3 నుంచి మణిపూర్‌లో గిరిజనుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ అన్నారు. ఉఖ్రుల్ జిల్లా కేంద్రం నుండి ఉదయం 4.30 గంటలకు 47 కి.మీ. కుకీ తెగ నివసించే తోవై కుకి గ్రామం వద్ద కొండపై నుంచి సాయుధ దుండగులు కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు.
Read also: Minister KTR: నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్నకేటీఆర్
మణిపూర్ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రతి క్షణం వేదనతో గడుపుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో గ్రామస్తులు గ్రూపులుగా విడిపోయి కాపలా కాస్తున్నారు. తోవై కుకి గ్రామంలో కాపలాగా ఉన్న గ్రామస్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం పోలీసులతో కలిసి భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. గత కొద్దిరోజులుగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా తప్పించుకోగలిగారు. సున్నితమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్‌లో చెలరేగిన హింసలో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
Indian Railways: వాణిజ్య అవసరాలకు భూమిని లీజుకు ఇవ్వనున్న రైల్వే.. 7,500 కోట్లు సమీకరించే ప్లాన్