Manipur Violence: క్రిస్మస్ వేళ.. కాల్పులతో మరోసారి దద్దరిల్లిన మణిపూర్
- మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులు
- ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల్లోని గ్రామాల్లో ఘటన
- మృతుల సంఖ్యపై తెలియని సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య గురించి ఖచ్చితమైన సమాచారం అందలేదు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను ప్రభావిత గ్రామాలకు పంపారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
మరోవైపు.. చురచంద్‌పూర్ జిల్లాలో భద్రతా దళాలు వంతెన కింద నుంచి 3.6 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో ఇంఫాల్-చురచంద్‌పూర్ రహదారిలోని లీసాంగ్ గ్రామం నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పేలుడు పదార్థాలతో పాటు.. డిటోనేటర్లు, కార్డ్‌టెక్స్, ఇతర వస్తువులను బృందం స్వాధీనం చేసుకుంది.
READ MORE: Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
ఇదిలా ఉండగా.. ఈశాన్య భారతానికి విలువైన ఆభరణంగా వాసికెక్కిన రాష్ట్రం మణిపుర్. చూడచక్కని ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ రాష్ట్రం ఇటీవల మళ్లీ అగ్నిగుండంగా మారింది. మైతేయి-కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏళ్లుగా అల్లకల్లోలంగా ఉన్న మణిపుర్‌లో హింస మరోసారి పెచ్చుమీరుతోంది. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. అప్పటి నుంచి వరసగా గృహ దహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?