Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
- శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
- ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు
- ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు బీహార్‌కు చెందిన కూలీలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శనివారం సాయంత్రం కక్చింగ్ జిల్లాలో ఇద్దరు కార్మికులను కాల్చి చంపారు. మృతులు 18 ఏళ్ల సునీలాల్ కుమార్, 17 ఏళ్ల దశరత్ కుమార్‌గా గుర్తించారు. వారు బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని రాజ్‌వాహి గ్రామ నివాసులు. కాగా.. యువకులిద్దరూ కక్చింగ్‌లోని మెయిటీ ఆధిపత్య ప్రాంతంలో నివసిస్తున్నారు. కక్చింగ్-వాబగై రోడ్డులోని పంచాయతీ కార్యాలయం సమీపంలో సాయంత్రం 5:20 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు వారిని కాల్చేశారు.
LK Advani: ఐసీయూలో అద్వానీ.. డాక్టర్లు ఏమన్నారంటే?
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
కార్మికులపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న కుల ఘర్షణల కారణంగానే వారిని హతమార్చినట్లు తెలుస్తోంది. మణిపూర్ పోలీసు కమాండోలు తౌబల్ జిల్లాలోని సలుంగ్‌ఫామ్ మానింగ్ లేకై వద్ద అనుమానిత ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన ఉగ్రవాదిని 16 ఏళ్ల లైష్రామ్ ప్రియమ్ అలియాస్ లోక్‌తక్‌గా గుర్తించారు. అతను నిషేధిత సంస్థ PREPAK సభ్యుడు. ఆ ప్రాంతంలో సాయుధులు ఉన్నట్లు పోలీసులకు నిఘా వర్గాల సమాచారం అందింది. దీంతో.. ఉదయం 9:30 గంటలకు సలుంగ్‌ఫామ్ హైస్కూల్ సమీపంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌లో ప్రియమ్‌ను కాల్చి.. అనంతరం ఇంఫాల్‌లోని రాజ్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు.
Atul Subhash Case: టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. అతుల్ భార్య, అత్త అరెస్ట్
అతని వద్ద నుంచి పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మూడు INSAS రైఫిల్స్, SLIR రైఫిల్, 303 రైఫిల్, AMOGH రైఫిల్, అనేక మ్యాగజైన్లు.. మందుగుండు సామగ్రి ఉన్నాయి. నాలుగు చక్రాల వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. కుకీ మిలిటెంట్ల దాడుల నుంచి గ్రామాలను రక్షించేందుకు మూడు నెలల క్రితం తన కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడని ప్రియమ్ తల్లి లైష్రామ్ గీత్మాల తెలిపారు. ప్రియం హైస్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడని ఆమె చెప్పింది. “ఈ సంక్షోభం అంతం కావాలి. హింస ఆగకపోతే, ఈ రోజు నేను అనుభవిస్తున్న అదే బాధను చాలా కుటుంబాలు అనుభవిస్తాయి” ప్రియమ్ తల్లి అన్నారు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!