Manipur Violence: 2023 మే నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల సంఘర్షణతో అట్టుడుకుతోంది. హింసలో దాదాపుగా 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మైయిటీ, కుకీల మధ్య నెలకొన్న హింసపై మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాష్ట్ర ప్రజల్ని క్షమాపణలు కోరారు. గతాన్ని ‘‘క్షమించండి, మరిచిపోంది’’ అని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
Read Also: January 2024 Movie Roundup: ఇళయరాజా కుమార్తె మృతి.. చిరంజీవికి పద్మ విభూషణ్.. హను-మాన్ పంచాయితీ!
ఇంఫాల్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన..‘‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరం. గత ఏడాది మే 3 నుండి ఈ రోజు జరుగుతున్న దానికి నేను రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ప్రియమైన వారిని కోల్పోయారు. చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టారు. నేను చింతిస్తున్నాను. నేను క్షమాపణలు కోరుతున్నాను. అయితే ఇప్పుడు, గత మూడు, నాలుగు నెలలుగా శాంతి దిశగా పురోగతిని చూసిన తర్వాత, 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను ఆశిస్తున్నాను’’ అని అన్నారు.
షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ) హోదా కోసం మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య హింస చెలరేగింది. మే 2023 నుంచి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపుగా 53 శాతం ఉన్నారు. వీరు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. ప్రధానంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణ జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన చర్చలు మరియు చర్చల్లోనే ఏకైక పరిష్కారం ఉందని బీరెన్ సింగ్ అన్నారు.