Manipur Violence: మణిపూర్‌లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రతిరోజూ హింసాత్మక ఘటన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి దుండగులు సెక్యూరిటీ గార్డు ఇంటికి నిప్పు పెట్టారు. మణిపూర్ హింసను అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది.
Supreme Court: వేసవి సెలవుల అనంతరం జులై 3వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు మరోసారి తెరుచుకుంది. ఈరోజు తొలిరోజైన రెండు ప్రధాన అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Manipur Violence: మణిపూర్‌లో హింస చెలరేగి రెండు నెలలు గడిచినా, ఇప్పటికీ పరిస్థితి భయంకరంగానే ఉంది. అనేక ప్రాంతాల నుంచి నిరంతర హింసాత్మక వార్తలు వస్తున్నాయి. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే అక్రమాలకు విఘాతం కలిగించేందుకు అక్రమార్కులు నిరంతరం ప్రయత్నిస్తున్నారన్నారు.
Manipur CM: మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామాకు సిద్దమయ్యారు. రాజధాని ఇంఫాల్ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాజీనామాను గవర్నర్ కి సమర్పించేందుకు రాజ్ భవన్ వెళ్లే సందర్భంలో ఆయన మద్దతుదారులు సీఎం ఇంటి ముందు భారీగా చేరుకున్నారు. రాజీనామా చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆన్నారు.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఈ సమస్యను పరిష్కరించనుందుకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు సీఎం నివాసం ముందు ఆందోళన చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరారు.
మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితుల కారణంగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ఈ రోజు గవర్నర్‌ను కలవనున్నారు. బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.
Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతోంది. మైయిటీ, కూకీల మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి వెళ్లాయి. ఇదిలా ఉంటే గురువారం మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే ఆయన పర్యటనపై ఆల్ మణిపూర్ స్టూడెంట్ యూనియన్(AMSU) ఆగ్రహం వ్యక్తం చేసింది.