Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింసాకాండ.. స్కూల్స్ తెరిచిన తెల్లారి మహిళ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్‌లో హింసాకాండ ఎంతకి ఆగడం లేదు. స్కూల్స్ తెరచిన మరుసటి రోజునే ఓ పాఠశాల బయట ఒక మహిళను ఇద్దరు గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా కాల్చి చంపేశారు. గత రెండు నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అల్లర్లు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం సాయుధ దళాల మధ్యలోనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పాఠశాలలు ఇంతకు ముందే తెరవాల్సి ఉండగా రాష్ట్రంలో ఉద్రిక్తత తగ్గకపోవడంతో వేసవి సెలవులను పొడిగించారు.
Also Read: CM YS Jagan: గృహనిర్మాణాశాఖపై సీఎం సమీక్ష.. పేదలకు ఇళ్లు రాకూడదని కుట్ర చేస్తున్నారు..!
Also Read
రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత జులై 5న స్కూల్స్ రీఓపెన్ కాగా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయంతో వెనుకడుగు వేశారు. దీంతో మొదటి రోజున విద్యార్థుల హాజరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ.. రెండో రోజున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ లో శిశు నిష్ఠ నికేతన్ స్కూల్ ఎదురుగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కాల్చి చంపడంతో స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరింత భయాందోళనలకు గురయ్యారు.
Also Read: GHMC : థీమ్ పార్క్‌గా రూపాంతరం చెందిన డంప్ యార్డ్
అయితే.. చనిపోయిన మహిళ వివరాలతో పాటు హంతకులు వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం కంగ్పోక్పి జిల్లాలో మాపావో, సవాంగ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ వర్గాలు గొడవకు దిగడంతో భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. అంతకు ముందు థౌబల్ జిల్లాలో పోలీసుల ఆయుధ కర్మాగారం నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లాలని అల్లరిమూకలు చూశాయి. వారి ప్రయత్నాన్ని భగ్నం చేసిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ సైనికుడి ఇంటిని తగలబెట్టడంతో ఘర్షణ తలెత్తింది.. దీంతో 27 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాల అయ్యాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!