Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Mamata Banerjee-Akhilesh Yadav New Front Without Congress: 2024 లోక్ సభ ఎన్నికల ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు విపక్ష పార్టీలు తమ ఎన్నికల ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ చీఫ్ మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. ఇరువురు నేతల భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న…
Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు, సాగర్దిఘి ఉపఎన్నికల్లో విజయం సాధించలేకపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ.. తమ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని చెప్పారు.
Mamata Banerjee criticizes BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Suvendu Adhikari slams Nobel laureate Amartya Sen: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పై మండిపడ్డారు బీజేపీ నాయకుడు, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి. ఇటీవల అమర్త్యసేన్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రధాని కాగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బెంగాల్ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సువేందు అధికారి ఆయనపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి దేశాన్ని తాకినప్పుడు అమర్త్యసేన్ ఎక్కడు ఉన్నారని.. 2021 ఎన్నికల తరువాత…
Vande Bharat Express : పశ్చిమ బెంగాల్లోని హౌరా రైల్వే స్టేషన్లో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
"Please Save Democracy," Mamata Banerjee Urges Chief Justice of India: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో అధ్యక్ష తరహా పాలనకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని ఆమె భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు. కోల్కతాలోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జురిడికల్ సైన్సెస్ (ఎన్యుజెఎస్) స్నాతకోత్సవానికి హాజరైన సిజెఐ జస్టిస్ యుయు…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి మరోసారి మద్దతుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై మండిపడ్డారు. కుట్రపూరిత రాజకీయాలతోనే సౌరభ్ గంగూలీని ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేట్ చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో సారి సౌరవ్ గంగూలీకి అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గంగూలీని వంచించారని, అన్యాయంగా రేసు నుంచి తప్పించారని ఆమె ఆరోపించారు.