పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారత ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. టీఎంసీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎదుర్కోవాలని యోచిస్తోంది.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 2024 ఏప్రిల్ లేదా మే లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇప్పుటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ.. ఈసారి మోదీ సర్కార్ కు గద్దె దించాలని ప్రతిపక్షాలు పట్టుదలతో ఉన్నాయి.
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై…
Amit Shah: శ్రీరామ నవమి రోజు పశ్చిమ బెంగాల్ హౌరాలో తీవ్ర హింస చెలరేగింది. హౌరాలోని కాజీపారా, శిబ్ పూర్ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నవమి తర్వాత రోజు కూడా హౌరాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. కొంతమంది గుంపు ఇళ్లపై రాళ్ల దాడులు చేశారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో పరిస్థితి ఆరాతీయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్…
Ram Navami violence: శ్రీరామ నవమి రోజు ఆరు రాష్ట్రాల్లో హింసాకాండ జరిగింది. శ్రీరాముడి ఊరేగింపు సమయంలో రెండు వర్గాల వారు ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడం, రాళ్లు రువ్వడం వంటి ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ హింసాకాండలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించగా.. చాలా మంది గాయపడ్డారు. మహరాష్ట్రలో ఒకరు, పశ్చిమబెంగాల్ లో మరొకరు మరణించారు. మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది.
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని…
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావట్లేవంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల పాటు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా సందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తన గాత్రంతో ఆకట్టుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఇవాళ సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు బీజేపీయేతర ముఖ్యమంత్రులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీల్ కుదర్చుకున్నారని, ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిష్టను కంచపరుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మమతా బెనర్జీ ఈడీ, సీబీఐ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవాలని అనుకుంటోందని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.