Asaduddin Owaisi comments on nitish kumar, mamata banerjee: ఇటీవల ఎన్డీఏ పార్టీకి, బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు బీహార్ సీఎం నితీష్ కుమార్. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో కలిసి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు రోజులు పర్యటించి విపక్ష నేతలు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ వంటి వారిని…
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్లో శనివారం ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కాంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని అరెస్టు చేసింది. మంత్రి సన్నిహితుడి నుంచి రూ.20 కోట్లు స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత అరెస్టు జరిగింది. కాగా.. నగదు రికవరీ కావడంతో తృణమూల్ నేతను రాత్రంతా విచారించారు. విచారణ సమయంలో…
ఆ నాయకుడు బీజేపీలో కొత్త సంప్రదాయానికి తెర లేపారా? వచ్చే ఎన్నికల్లో పలానా చోటు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంలో ఆంతర్యం ఏంటి? అధిష్ఠానం చెప్పిందా.. లేక ఆయనే అడ్వాన్స్ అయ్యారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీజేపీలో ఎంతటి పెద్దవాళ్లయినా సరే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుంది. ఆ అధికారం రాష్ట్ర పార్టీ చేతిలో కూడా ఉండదు. అందుకే ఈ విషయంలో బీజేపీ నేతలు ఎవరూ…
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో…
కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. ఒక్కో సారి యజమాని కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కాపాడిన కుక్కల గురించి చాలా కథలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే మరోసారి కోల్కతాలో జరిగింది. దొంగ బారి నుంచి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా.. దొంగను పట్టించింది. దక్షిణ కోల్కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని జాదు భట్టాచార్య లైన్ లో ఓ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. సదరు ఇళ్లు బెంగాల్ సీఎం ఇంటికి…
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే మహారాష్ట్రలో ‘మహా’…
దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు మరోవైపు విపక్ష నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు. అధికార బిజెపి ఇప్పటికే పలు రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతోంది. ఇటు విపక్షలు కూడా అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రెండు పక్షాల నుంచి అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. విపక్షాలు ఒక తాటిపైకి వచ్చే ప్రయత్నాలు అయితే తెరవెనక గట్టిగానే జరుగుతున్నాయి. ఈ నెల 21న మరోసారి విపక్ష పార్టీలు మళ్లీ భేటీ…
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి. తాజాగా శరద్ పవార్…