పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొద్ది రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడింది. దీంతో చికిత్స కోసం హాస్పిటల్ లో అడ్మిట్ అయినా సీఎం మమతా బెనర్జీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గాయం నుంచి ఆమె త్వరగా కోలుకోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. ఈ క్రమంలో మరికొద్ది రోజుల పాటు సీఎం మమతా బెనర్జీ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Also Read: SSC Supplementary Results : విద్యార్థులకు అలర్ట్.. రేపు టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
అయితే.. గత కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్ పాయ్ గురి జిల్లాలో సీఎం మమతా బెనర్జీ బహిరంగ సభకు హాజరై తిరుగు ప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సెవొక్ ఎయిర్ బెస్ లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. హెలికాప్టర్ బైకుంటాపూర్ అటవీ ప్రాంతం మీదుగా వెళుతుండగా ప్రతికూల వాతావరణం ఎదురు కావడం జరిగింది.
Also Read: Bandi Sanjay : పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పని చేసే వ్యక్తి కిషన్ రెడ్డి
వర్షాలకు తోడులో విసిబిలిటీ కారణంగా హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వల్పంగా గాయపడింది. అనంతరం అక్కడి నుంచి సీఎం మమత బెనర్జీని రోడ్డు మార్గం గుండా బాగ్ డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి కోల్ కతాకు తీసుకోచ్చారు. అనంతరం దీదీ శరీరం వెనుక భాగంలో.. మోకాలికి స్వల్పంగా గాయాలు కావటంతో.. కోల్ కతాలోని ఎస్ఎస్కేఎం హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందించాగా.. కాలుకు సర్జరీ తర్వాత నేడు మమతా బెనర్జీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సూచించారు.