Mamata Banerjee: రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంః మమత బెనర్జీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: |ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన పశ్చిమబెంగాల్ వాసుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఘోర ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారి బంధువులకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ప్రస్తుతం మానసిక మరియు శారీరక గాయాలతో బాధపడుతున్న వారికి తమ ప్రభుత్వం నగదు సహాయం చేస్తుందని మమత తెలిపారు. ప్రమాదంలో గాయపడి భువనేశ్వర్ మరియు కటక్ నగరాల్లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మమతా బెనర్జీ మంగళవారం పరామర్శించనున్నారు.
Add also: Malware: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే డేంజర్.. మీ రికార్డులన్నీ బట్టబయలే
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 206 మంది ప్రయాణికులు గాయపడి ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. కటక్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 33 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మంగళవారం తనతోపాటు కొంతమంది రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు వస్తారని ఆమె చెప్పారు. బాధితుల బంధువులకు ఎక్స్‌గ్రేషియా చెక్కులతోపాటు.. ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌లను మమతా బెనర్జీ బుధవారం పంపిణీ చేయనున్నారు.
Add also: Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
ప్రమాదంపై తాను ఎలాంటి రాజకీయాలను చేయబోనని.. గాయపడిన ప్రయాణికులకు, వారి కుటుంబాలకు అన్ని విధాలా సాయం చేస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైలు ప్రమాదంలో గాయపడిన తమ రాష్ట్రానికి చెందిన ప్రయాణీకుల చికిత్స మరియు పునరావాసాన్ని పర్యవేక్షించడానికి మంగళవారం వెళ్లాలలని నిర్ణయించిన నేపథ్యంలో .. తన నాలుగు రోజుల డార్జిలింగ్ పర్యటనను రద్దు చేసుకున్నారని బెంగాల్ సీఎంవో వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం మమత హిల్స్‌లోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులను కలవాల్సి ఉందని సచివాలయ వర్గాలు తెలిపాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం మమతా బెనర్జీ డార్జిలింగ్ పర్యటనను కొనసాగిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!