Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
NITI Aayog: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి 8 రాష్ట్రాల సీఎంలు గైర్హాజరయ్యారు. ‘‘విక్షిత్ భారత్ @2047: టీమ్ ఇండియా పాత్ర’ అనే అంశంపై నీతి ఆయోగ్ ఎనిమిదో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి వీరంతా రాలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, తెలంగాణ సీఎం కేసీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా సీఎం నవీన్…
ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 9 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు డుమ్మా కొట్టారు.
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు.
Karnataka CM swearing-in ceremony: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 224 స్థానాల్లో ఏకంగా 135 స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిన తర్వాత సీఎం పీఠం కోసం సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ ఎదురైంది. నాలుగు రోజుల హస్తినలో చర్చల తర్వాత సిద్దరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఒప్పించింది. మే 20న బెంగళూర్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఐక్య విపక్ష కూటమి ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mamata Banerjee: కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంపై ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం, డీఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పశ్చిమ బెంగాల్ క్లబ్ మైదానంలో తన సంగీత కచేరీకి ముందు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్కతాలో కలిశారు. కాళీఘాట్లోని బెనర్జీ నివాసంలో ఈ సమావేశం జరిగింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తన ఫేస్ బుక్ పేజీలో ప్రధాని నరేంద్రమోడీ ‘మన్ కీ బాత్’ ప్రోగాం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఏకం కావాలని అన్ని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి అందరూ కలిసి బీజేపీని ఓడించగలరని ఆమె అన్నారు.
CM KCR: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా మొదటిస్థానంలో నిలిచారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అఫిడవిట్ లో వెల్లడించిన దాని ప్రకారం సీఎం ఆస్తుల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ.510 కోట్లు ఉన్నట్లు వెల్లడైంది. దేశంలో అతి తక్కువ ఆస్తులు రూ. 15 లక్షలు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం…