Kolkata Messi Tour Chaos: కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఏర్పడిన గందరగోళంపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ CV ఆనంద బోస్ సీరియస్‌గా స్పందించారు.
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్‌లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.
Mamata Banerjee: మరికొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో ఓటర్ల జాబితాను సమీక్షిస్తోంది. అయితే, దీనిపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడుతోంది. మరోసారి సర్ ప్రక్రియను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో మహిళల పేర్లు తొలగిస్తే, వారంతా వంటగదిలో వాడే పనిముట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు. ‘‘ఎస్ఐఆర్ పేరుతో తల్లులు, సోదరీమణుల…
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘‘తెలివైన కుట్ర’’కు తెర తీశారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై సీఎం మమతా బెనర్జీ ఆరోపణలు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు విజయవంతం కావని ఆమె హెచ్చరించారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
DSP Richa Ghosh: భారతీయ మహిళా క్రికెట్ జట్టులోకి మరో డిస్పీ వచ్చారు. భారత మహిళా క్రికెట్ జట్టుకు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన రిచా ఘోష్, పశ్చిమ బెంగాల్ పోలీసులో డిఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమెకు నియామక లేఖను స్వయంగా అందజేశారు. భారత మహిళా జట్టు ఇటీవలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన రిచా…
Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్‌కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.