Congress: కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని దారుణంగా ఓడించామని సంబర పడుతున్న కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఎదురుదెబ్బ తాకింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పార్టీలో చేరాడు. దీంతో బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ సోమవారం టీఎంసీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో టీఎంసీలో చేారారు.
Read Also: Loan App Harassment: అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే.. మహిళకు వేధింపులు
ఈ చేరిక సందర్భంగా అభిషేక్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని టీఎంసీని వ్యతిరేకించాలా..? లేకపోతే కేంద్రంలోని బీజేపీని వ్యతిరేకించాలా..? అనేదాన్ని కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి అని అన్నారు. మైనారిటీలు అధికంగా ఉండే పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని సాగర్ ఢీఘీ నుంచి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచారు. సమీప టీఎంసీ ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. గెలిచిన మూడు నెలల తర్వాత ఆయన కాంగ్రెస్ ను వదిలి టీఎంసీలో చేరారు. ‘‘బీజేపీ విభజన మరియు వివక్షాపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే మీ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి. , మీరు సరైన ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకున్నారు. కలిసికట్టుగా గెలుస్తాం’’ అని టీఎంసీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. ప్రముఖ బీడీ వ్యాపారి అయిన బిశ్వాస్ గెలుపుతో కాంగ్రెస్ పాత్ర ఏం లేదని టీఎంసీ అంది.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది. అయితే సాగర్ డిఘి స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరుపున బిశ్వాస్ గెలవడం ఆ పార్టీకి ఊపిరి పోసింది. అయితే ఇది ఎన్నోరోజులు నిలవలేదు. బిశ్వాస్ చేరికతో టీఎంసీని వ్యతిరేకించే బీజేపీ, కాంగ్రెస్ కూటమి ఓడిపోయిందని అభిషేక్ బెనర్జీ అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అనైతిక పొత్తు ఉందని ఆరోపించారు.