INDIA bloc: కాంగ్రెస్ పార్టీకి వరస షాకులు తగులుతున్నాయి. అదికార బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దింపుతామంటున్న ఇండియా బ్లాక్లో లుకలుకలు కనిపిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
Mamata Banerjee: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు ఈ రోజు కొలువయ్యాడు. 500 ఏళ్ల కల ఈ రోజు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో నిజమైంది. దేశం మొత్తం అంతా శ్రీరామ నామంతో నిండిపోయింది. అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని ప్రముఖుల, లక్షలాది మంది భక్తుల సమక్షంలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది.
BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది.
లోక్సభ ఎన్నికలకు ముందు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ద్వారా బీజేపీ జిమ్మిక్కులకు పాల్పడుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఓ జిమ్మిక్ షో అని ఆమె వ్యాఖ్యానించారు.
బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు.. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ లాంటి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిశారు. సోమవారం ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్తో మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా కూడా పాల్గొన్నారు.
West Bengal CM Mamata Banerjee React on Parliament Security Breach: ఇటీవల పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం తీవ్రమైన అంశం అని, పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ఇప్పటికే అంగీకరించారని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు. విపక్ష పార్టీల కూటమి ఇండియా సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ నేడు ఢిల్లీ పయనమయ్యారు. ఈ…