PM Modi: పార్లమెంట్ ఎన్నికల ముందు చివరిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. బుధవారం రాజ్యసభలో మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 40 సీట్లు దాటదని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాతబడిందని విమర్శించారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీలైనా.. ప్రత్యర్థి పార్టీల్లా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకుని రోడ్డెక్కుతున్నారు. ఈ వ్యవహారం అధికార పార్టీకి అస్త్రంగా అవకాశం ఇస్తున్నారు.
Mamata Banerjee: బీజేపీని గద్దె దించాలని, ప్రధాని నరేంద్రమోడీకి అధికారాన్ని దూరం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల కాలంలో కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే కూటమితో జతకట్టారు. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్తో సీట్లను పంచుకోమని తెగేసి చెప్పాయి.
రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
ఇండియా కూటమిలో విభేదాలు మరింత ముదురుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జేడీయూ బయటకు వచ్చేసి ఎన్డీఏతో జత కట్టింది. తాజాగా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిని ఆందోళనకు గురయ్యేలా చేశాయి. ఓ కార్యక్రమంలో మమత మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు.
Bihar Politics: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు బలం మరింత పెరిగింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ పార్టీ, సీఎం నితీష్ కుమార్ వైదొలిగారు. రెండు రోజులుగా నెలకొన్న అనిశ్చితిపై ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఆదివారం సీఎం నితీష్ కుమార్ తన రాజీనామా లేఖను గవర్నర్కి సమర్పించారు, సాయంత్రం 5 గంటలకు బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బకాయి నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల అల్టిమేటం ఇచ్చినట్లు తెలిపారు.
INDIA Bloc: 2024 లోక్సభ ఎన్నికల ముందే ఇండియా కూటమి ముక్కలు అవుతుందా..? ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు, బీజేపీ నుంచి అధికారాన్ని లాక్కోవాలని దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, ఆ లక్ష్యం నెరవేరక ముందే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూటమిని వదిలేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మమతా బెనర్జీ కాంగ్రెస్తో పొత్తు ఉండదని, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా…
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆమె తకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.