Mamata Banerjee: మహిళలపై లైంగిక వేధింపులతో ఇటీవల బెంగాల్లోని సందేశ్ఖాలీ ప్రాంతం అట్టుడికింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు ఉద్యమించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్రమోడీ టీఎంసీ పార్టీ, సీఎం మమతా బెనర్జీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ వచ్చారు. హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే వంట గ్యాస్ సిలిండర్ల ధర అమాంతంగా పెరిగిపోతాయని హెచ్చరించారు.
Mamata Banerjee: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ ధర పెంచవచ్చని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. గ్యాస్ ధర రూ. 2000 వరకు పెంచవచ్చని గురువారం అన్నారు. ‘‘బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే, వంటగ్యాస్ ధరలను రూ. 1500 లేదా రూ.2000 పెంచవచ్చు. మళ్లీ మనం మంటల్ని వెలిగించేందుకు కలపను సేకరించే పాత పద్ధతికి వెళ్లాల్సి ఉంటుంది’’ అని మమతా బెనర్జీ అన్నారు. ఝర్గ్రామ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ…
పశ్చిమబెంగాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేషన్ (Aadhaar Deactivation) చేయడంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రధాని మోడీకి (PM Modi) ఘాటు లేఖ రాశారు.
Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం రాబోయే లోక్సభ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ప్రజల ఆధార్ కార్డులను ‘డీయాక్టివేట్’ చేసిందని, తద్వారా ప్రజలకు వచ్చే ప్రయోజనాలు, సంక్షేమ పథకాలు పొందకుండా చేశారని ఆదివారం ఆరోపించారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున అన్నదాతలు (Farmers Protest) దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. సరిహద్దుల్లోనే వారిని నిలువరించేందుకు భద్రతా బలగాలు మోహరించాయి.