Rachana Banerjee: గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు పైకి ఎదుగుతారు.. ఎవరు ఎప్పుడు కిందకి పడతారు అనేది ఎవరికి తెలియదు. ఇక ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. ఇంకొంతమంది కెరీర్ పై భయంతో వ్యసనాలకు బానిసలై జీవితాలనే నాశనం చేసుకున్నారు. ఇక చేజేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్న హీరోయిన్ లిస్టులో రచనా బెనర్జీ పేరు కూడా ఉంటుంది. ఇప్పుడంటే ఈ బ్యూటీ ఎవరికి తెలియదు గానీ, ఒకానొక టైం లో రచన ఎంతో మంది కుర్రకారుకు ఆరాధ్య దేవత. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలు అందరితోనే కాకుండా ఉపేంద్ర, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలతో కూడా నటించి మెప్పించింది. ఒడియా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించారు. జేడీ చక్రవర్తి హీరోగా ఈవీవీ తీసిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. చిరంజీవితో బావగారూ బాగున్నారా, శ్రీకాంత్‌తో కన్యాదానం, మావిడాకులు, పిల్లనచ్చింది సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇక టాలీవుడ్ నుంచి రచన ఒక్కసారిగా కనుమరుగైపోవడం తెలుగు ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. అయితే అలా ఆమె కనుమరుగైపోవడానికి కారణం ఆమె చెడు వ్యసనాలే అని ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అందంతో పాటు అభినయం కలగలిపిన ఈ బెంగాలీ భామ ఉన్నాకొద్దీ అవకాశాలు తక్కువ అవ్వడంతో.. మద్యం, సిగరెట్లకు బానిసగా మారింది. చేతిలో ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని.. ఎంతోమంది దగ్గర అప్పులు కూడా చేసిందని టాక్.ఆమె పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుసుకున్న తల్లిదండ్రులు.. వెంటనే రచనకు బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ప్రోబల్ బసు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత రచనలో చాలా మార్పు వచ్చింది. చెడు అలవాట్లకు దూరమై గృహిణిగా మారింది.
ఇక ఇన్నేళ్ల తర్వాత అందరి సీనియర్ నటీమణులుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుంది అనుకునే లోపు రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలిపి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హడావిడి మొదలైపోయిన విషయం తెలిసిందే. సీఎం మమతా బెనర్జీ ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఎంతగానో కష్టపడుతున్నారు. మొత్తం 42 స్థానాలకు గాను ఎవరెవరు పోటీ చేస్తున్నారనే విషయమై ఆమె క్లారిటీ ఇచ్చేశారు. అందులో రచన పేరు కూడా ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం నుంచి హుగ్లీ నియోజకవర్గం నుంచి రచన ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ నుంచి హుగ్లీని కైవసం చేసుకోవాలని మమత ఎంతగానో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలోనే రచనను బరిలోకి దింపితే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆ నియోజకవర్గంలోని ఆమె ఎంపీగా నిలబెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.