నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు.
BJP MP: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ మహువాను విచారించింది. ఆమెను లోక్సభ నుంచి బహిష్కరించాలని సిఫారసు చేసింది. ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ని టార్గెట్ చేస్తూ మహువా కావాలనే ప్రశ్నలు అడిగినట్లు తేలింది. ఇదే కాకుండా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులతో పంచుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే…
Mamata Banerjee: బీజేపీకి బెంగాల్ సీఎం, తృణమూల్ సుప్రీమో మమతా బెనర్జీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీకి చెందిన నలుగురిని కేంద్ర ఏజెన్సీలు అరెస్ట్ చేశాయని, రాష్ట్ర పోలీసులు ఇందుకు ప్రతిగా 8 మంది బీజేపీ నాయకులను జైలులో పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్కతాలో జరిగిన పార్టీ సమావేశంలో టీఎంసీ అధినేత్రి బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు.
Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం, గిఫ్టులు తీసుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపి మహువా మోయిత్రాకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ (నాడియా నార్త్) అధ్యక్షురాలిగా మొయిత్రాను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నియమించారు.
Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందుకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచే అరెస్టులు ప్రారంభించారని ఆమె ఆరోపించారు.
Nano : దేశంలోని పురాతన వ్యాపార సంస్థలలో ఒకటైన టాటా గ్రూప్ పశ్చిమ బెంగాల్లో భారీ విజయం సాధించింది. అక్కడ జరుగుతున్న పాత సింగూరు భూవివాదంలో టాటా పెద్ద విజయం సాధించింది.
శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్శిటీలో యునెస్కో 'వరల్డ్ హెరిటేజ్ సైట్' ఫలకాలపై రవీంద్రనాథ్ ఠాగూర్ పేరును రాయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు.
సిక్కింలో మేఘాలు విధ్వంసం సృష్టించాయి. మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో వరదలు పోటెత్తడంతో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతింది. తీస్తా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో 23 మంది సైనికులు కూడా గల్లంతయ్యారు.
Kolkata : మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనకు బయలుదేరిన విషయం అందరికి సుపరిచితమే. కాగా ఆమె మంగళవారం సాయంత్రం దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నారు.