ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం పశ్చిమబెంగాల్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో పర్యటన కొనసాగుతోంది. హుగ్లీ, నదియా జిల్లాల్లో రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేయనున్నారు. అక్కడ ప్రధానిని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) కలిసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఆధార్ కార్డులు బ్లాక్ చేశారంటూ ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. అలాగే ఉపాధి హామీ పథకానికి (MGNREGA) సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని మోడీని కోరనున్నారు. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర బకాయిల విడుదల కోసం ఒత్తిడి చేయడానికి ఢిల్లీలో ప్రధాని మోడీని మమత కలిశారు. కేంద్రం రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మూడోసారి మోడీ ప్రభుత్వం వస్తే.. వంట గ్యాస్ ధర రూ.2 వేలకు పెరిగిపోతుందని చెప్పుకొచ్చారు. పలు సందర్భాల్లో కూడా ఆరోపణలు గుప్పించారు. ఇంకోవైపు సందేశ్‌ఖాలీ ఘటనతో బీజేపీ కూడా గుర్రుగా ఉంది. భూకబ్జా, లైంగిక ఆరోపణల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద ఎత్తున బీజేపీ కూడా ఆందోళనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. మరీ మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.