కరోనా అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కొందరు నిర్మాతలు తమ చిత్రాల బడ్జెట్ ఎక్కువ అయ్యిందని టిక్కెట్ రేట్లు పెంచుకునే వెసులు బాటు కల్పించమని ప్రభుత్వాలను కోరారు. ఏపీ ప్రభుత్వం మొదట్లో టిక్కెట్ రేట్లను అమాంతంగా తగ్గించేసినా, ఆ తర్వాత బాగానే పెంచింది. ఇక భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు అడగడం ఆలస్యం వాటి టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి సై అనేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తన తాజా చిత్రం ‘ఎఫ్ 3’ని…
టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక…
అచ్చతెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సందర్భానుసారం మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తమ సినిమాల విడుదల సమయంలో టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్లకు అలవాటే. అంతేకాదు… బిగ్ బాస్ షో జరుగుతున్న సమయంలో అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్టులుగా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహాలో ఈ వారం రెండు కార్యక్రమాలలో ‘మేజర్’ మూవీ టీమ్ సందడి చేయబోతోంది. ముంబై దుర్ఘటనలో అశువులు…
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ…
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికీ సినిమా నుచ్న్హి రిలీజైన ట్రైలర్,స్ ఒంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ…
హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి…
తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లను అమాంతం పెంచేయడం వల్ల, సాధారణ ఆడియన్స్ థియేటర్లకు రావడం చాలావరకు తగ్గించేశారు. ఈ దెబ్బకు.. కలెక్షన్ల పరంగా చాలా చిత్రాలు ప్రభావితం అయ్యాయి. చాలా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది గమనించిన మన మేకర్స్.. టికెట్ రేట్ల విషయమై తలొగ్గుతున్నారు. ఆల్రెడీ ఎఫ్3 సినిమాకు సాధారణ టికెట్ రేట్లే పెడుతున్నామని నిర్మాత దిల్‌రాజు ప్రకటించేశారు. ఇప్పుడు మేజర్ సినిమాకీ సాధరణ రేట్లకే టికెట్లు అందుబాటులో ఉంటాయని హీరో అడివి శేష్…
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న విడుదల కాబోతోంది. ఇటీవల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు దర్శక నిర్మాతలు అందులో భాగంగా బుధవారం సాయంత్రం ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘ఓహ్ ఇషా’ అనే పాట రిలికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక గెట్ టు గెదర్ లో ఆర్మీ అధికారులు…
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా అతని…
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న యువ హీరోల్లో అడివి శేష్ ఒకడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు త్వరలోనే ‘మేజర్’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శేష్.. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న కొన్ని పరాభావాల్ని చెప్పుకొచ్చాడు. చందమామ సినిమాలో ముందుగా హీరోగా తననే తీసుకున్నారని, నవదీప్ స్థానంలో తాను ఉండాల్సిందని శేష్…