హాలీవుడ్ సినిమాల్ని రిలీజ్ చేయడానికి ముందు, కొన్ని ప్రధాన నగరాల్లో ప్రివ్యూస్ వేస్తారు. పది లేదా నెల రోజుల వ్యవధిలో ప్రివ్యూ షోస్ వేయడం జరుగుతుంది. తమ సినిమాలకు మరింత బజ్ తెచ్చుకునేందుకే ఈ స్ట్రాటజీ. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తన ‘మేజర్’ సినిమాకి అడివి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ఉండే జనాల్లోకి తీసుకువెళ్ళడం కోసం.. ప్రీవ్యూస్ వేసేందుకు రెడీ అయ్యాడు. 9 ప్రధాన నగరాల్లో వేయనున్న ఈ ప్రివ్యూ స్క్రీనింగ్.. మే 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విడుదలకి పది రోజుల ముందు ఇలా ప్రివ్యూస్ వేయడం, భారత్‌లో ఇదే మొదటిసారి.
ఈ స్క్రీనింగ్ కోసం మేకర్స్ బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రివ్యూస్ చూడాలనుకున్న వారు.. బుక్ మై షో లో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి మొదలైన నగరాల్లో ప్రివ్యూస్ ప్రదర్శిస్తారు. ఈ ప్రయోగం ‘మేజర్’ చిత్రానికి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో చూడాలి. కాగా.. ముంబై బాంబు దాడుల్లో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా.. శోభితా ధూలిపాళ ఓ కీలక పాత్ర పోషించింది.
సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. శశి కిరణ్ తిక్కా తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాలా సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో జూన్ 3వ తేదీన భారీఎత్తున విడుదలకు ముస్తాబవుతోంది.
HERE it is!!! MASSIVE! For the FIRST TIME EVER!#MAJOR
X@bookmyshow pic.twitter.com/so2fTAx4Y6— Adivi Sesh (@AdiviSesh) May 23, 2022