టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రాన్ని పావురు యుద్ధవీరులకు చూపించిన టీమ్ వారి నుసిన్హు గొప్ప ప్రసంశలను అందుకుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీరితో పాటు పలువురు ప్రముఖులకు కూడా చిత్రబృందం ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేసి మరీ చూపించనున్నారట. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉండడం విశేషం. ఈ విషయాన్ని హీరో అడివిశేష్ కూడా చెప్పడం గమనార్హం.
ఇటీవల అడవి శేష్ అయితే ఒక నెటిజన్ల అడిగిన ప్రశ్నకు.. తప్పకుండా పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా స్పెషల్ షో వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరించిన విషయం విదితమే.. దీంతో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాల్సింది మహేష్ బాబే.. మరికొన్ని రోజుల్లో మహేష్ సొంత థియేటర్ ఏఎంబి మాల్ లో పవన్ కళ్యాణ్ కు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ విషయం తెలియడంతో పవన్ ఫ్యాన్స్, మహేష్ ఫెయిన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఒకే ఫ్రేమ్ లో మహేష్- పవన్ ను చూడవచ్చని తెలుపుతున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.