అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మేజర్. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తుండగా GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికీ సినిమా నుచ్న్హి రిలీజైన ట్రైలర్,స్ ఒంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ 3 న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ వేగాన్ని షురూ చేసేశారు చిత్ర బృందం.
ఇక తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఆ అందులో భాగంగానే నేడు ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకోంది. మొత్తం 149 నిమిషాల నిడివితో సెన్సార్ బోర్డ్ ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్ ను జారీ చేసింది. సినిమాలోని కంటెంట్ మరియు లోతైన భావోద్వేగాలు సెన్సార్ అధికారులను ఆకట్టుకున్నట్లు సమాచారం. అంతేహాకాకుండా ఈ సినిమా చుసిన సెన్సార్ బోర్డు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి మేజర్ ఉన్నికృష్ణన్ కు సెల్యూట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ‘మేజర్’ సినిమా ఫస్టాప్ లో సందీప్ వ్యక్తిగత జీవితంలోని విషయాలను చూపించగా.. సెకండాఫ్ ను చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దారని మేకర్స్ ను ప్రశంసించారట. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ – శోభితా ధూళిపాళ – ప్రకాష్ రాజ్ – రేవతి మరియు మురళీ శర్మ ఇతర పాత్రలు పోషించారు. మరి ఈ సినిమాతో అడివి శేష్ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తాడో చూడాలి.