Congress: హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ పునర్వ్యవస్థీకరణ చేసింది. సామాజిక న్యాయం అనే నినాదం కాంగ్రెస్ పార్టీపై బలమైన ముద్ర వేసింది.
CM Chandrababu: టెంపుల్ సీటి తిరుపతిలో ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో జరగనుంది. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సదస్సు మరియు ప్రదర్శనను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, ప్రమోద్ సావంత్ లు పాల్గొననున్నారు.
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) ప్రధాన నిందితుడు హితేష్ మెహతాను అరెస్టు చేసింది. మొదట హితేష్ మెహతాకు సమన్లు పంపింది. హితేష్ నివాస స్థలానికి వెళ్లిన పోలీసులు విచారణ జరిపారు. అనంతరం హితేష్ అరెస్టు చేశారు.
మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కొత్త చట్టంలోని అంశాలను అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో స్త్రీ శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, చట్టం, న్యాయవ్యవస్థ, సామాజిక న్యాయం, ప్రత్యేక సహాయం శాఖల కార్యదర్శులు, హోం శాఖ డిప్యూటీ కార్యదర్శి ఉన్నారు.
GBS Virus : మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) విజృంభణ నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207 కు పెరిగింది. ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు కనుగొనబడ్డారు.
INDIA Alliance: ఢిల్లీలో ఆప్ ఓటమి ఇండియా కూటమిలో విభేదాలను సృష్టించింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే ఆప్, కాంగ్రెస్ మధ్య పొగడం లేదు. ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ని కాదని టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు ఆప్‌కి మద్దతు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. దీంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఆప్ ఓటమి తర్వాత కూటమి పార్టీలన్నీ ఇద్దరు కలిసి పోటీ చేయకపోవడాన్ని…
పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. వివాహం తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఓ పెళ్లిలో మాత్రం ఈ విధానాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఏకంగా వరుడి సిబిల్ స్కోర్ ను కూడా చెక్ చేశారు. ఇక్కడే వరుడికి షాక్ ఇచ్చారు అమ్మాయి తరపు బంధువులు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని ఆ పెళ్లిని క్యాన్సి్ల్ చేశారు. ఈ విచిత్ర ఘటన…
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.
T-shirt: కేవలం రూ. 300 టీ-షర్టుపై చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో టీ షర్టుపై చెలరేగిన వివాదం స్నేహితుడైన 30 ఏళ్ల వ్యక్తిని హత్య చేయడానికి కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం శాంతి నగర్ ప్రాంతంలో శుభమ్ హర్నే(30) అనే వ్యక్తి , టీ-షర్టు కొనుగోలు చేసిన అక్షయ్ ఆసోల్(26)కి రూ. 300 చెల్లించడానికి నిరాకరించాడు. దీనిని అక్షయ్ ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ఇది…