Maharashtra: ఔరంగజేబుపై ప్రశంసలు.. అబూ అజ్మీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
- మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం
- ఔరంగజేబుపై ఎస్పీ ఎమ్మెల్యే ప్రశంసలు
- అబూ అజ్మీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మార్చి 26న సమావేశాలు ముగియనున్నాయి. అయితే ఇటీవల ఓ సభలో ఔరంగజేబుపై ఆజ్మీ ప్రశంసలు కురిపించారు. దీంతో బుధవారం అసెంబ్లీలో అజ్మీకి వ్యతిరేకంగా మంత్రి చంద్రకాంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో అసెంబ్లీ ఆమోదించింది. దీంతో అజ్మీ శాసనసభ సభ్యత్వం రద్దైంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
అజ్మీ ఏమన్నారంటే..
ఔరంగజేబు పాలనలో భారతదేశ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్ మరియు బర్మా (మయన్మార్) వరకు ఉందని సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అజ్మీ అన్నారు. ‘‘మన జీడీపీ (ప్రపంచ జీడీపీలో) 24 శాతం వాటా కలిగి ఉంది. ఔరంగజేబు పాలనలో భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని పిలిచేవారు.’’ అని ఎమ్మెల్యే అజ్మీ పేర్కొన్నారు.
అజ్మీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఉభయ సభలను కుదిపేశాయి. ఆయనను సస్పెండ్ చేయాలని, ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని పాలక పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అజ్మీ వ్యాఖ్యలు.. శాసనసభ సభ్యుడి హోదాకు తగినవి కావని.. శాసనసభ ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని అధికార నేతలు ధ్వజమెత్తారు.
అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. అయినా అసెంబ్లీలో కాకుండా.. బయట ఎక్కడో మాట్లాడిన వ్యాఖ్యలను సభలోకి తీసుకురావడం సరైంది కాదని అజ్మీ తెలిపారు. ఔరంగజేబు గురించి చెప్పినదంతా చరిత్రకారులు, రచయితలు చెప్పినదే తాను వ్యాఖ్యానించినట్లు క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరి గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినా తన వ్యాఖ్యల వల్ల బాధపడుంటే వెనక్కి తీసుకుంటానని అజ్మీ తెలిపారు.
#WATCH | Suspended Maharashtra SP MLA Abu Azmi says, "To ensure that the House functions, I spoke about withdrawing my statement. I did not say anything wrong. Still, there is a controversy and proceedings of the House are being stalled. To ensure that the House functions and… pic.twitter.com/nXhyr22RcJ
— ANI (@ANI) March 5, 2025
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!