లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన సమాజంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
READ MORE: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో నమోదైన అత్యంత భారీ స్కోర్లు ఇవే
ఈ కేసులో రాహుల్ గాంధీ ఈరోజు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా, కానీ.. మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ న్యాయవాది దరఖాస్తు చేసుకున్నారు. “రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు. ఈరోజు ఆయన ఒక విదేశీ ప్రముఖుడిని కలవాల్సి ఉంది. ఈ సమావేశం ముందే ప్రణాళిక చేయబడింది. అందుకే అతను కోర్టుకు రాలేకపోతున్నాడు.” అని రాహుల్ గాంధీ న్యాయవాది పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న కోర్టు మినహాయింపు కోసం ఆయన చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. కోర్టుకు గైర్హాజరు అయినందుకు రూ. 200 జరిమానా విధించింది. అంతే కాకుండా… అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ రాహుల్ గాంధీని ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని హెచ్చరించారు. హాజరు కాకపోతే, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
READ MORE: Madhu Yashki: పార్టీ లైన్ దాటిన ఎవరిపైన అయినా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కామన్..