Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని చెప్పారు.
Nagpur: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి(16), 36 ఏళ్ల మహిళతో లేచిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ అప్పటికే ముగ్గురు పిల్లల తల్లి. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో క్రైమ్ బ్రాంచ్లోనిక్రైమ్ బ్రాంచ్‌లోని యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అతన్ని రక్షించింది. ఈ ఘటనపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సదరు మహిళ విద్యార్థి ఇంటి సమీపంలో నిసించేందని, తరుచుగా వీరిద్దరు ఒకే ఆలయానికి వెళ్లే వారని పోలీసులు…
Minister: మహిళలు తమ రక్షణ కోసం తమ పర్సులో కత్తి, కారం పొడిని తీసుకెళ్లాలని, లిప్ స్టిక్‌తో పాటు ఇవి కూడా ఉండాలని మహారాష్ట్ర మంత్రి గులబ్‌రావ్ పాటిల్ శనివారం సూచించారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు(ACJM) రూ.200 జరిమానా విధించింది. ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఇచ్చిన ప్రకటనకు సంబంధించినది. డిసెంబర్ 17, 2022న అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ పై వివాదాస్పద ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై లక్నోలోని ACJMలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. రాహుల్ గాంధీ ప్రకటన…
మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
ఓ బైకర్ నిర్లక్ష్యం కారణంగా బస్సులోని ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హైవేపై బస్సు వేగంగా దూసుకొస్తోంది. ముందున్న బైక్.. సడన్‌గా యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక బస్సు డ్రైవర్.. బైకిస్టుల ప్రాణాలు కాపాడేందుకు వేరే రూట్లోకి పోనిచ్చాడు.
మొఘల్స్ ఆఖరి చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాలను నిర్మించాడని, క్రూరమైనవాడు కాదని మహారాష్ట్రలోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అబూ అజ్మీ ప్రశంసించారు. దీంతో ఆ కామెంట్స్ వివాదానికి దారితీసింది. ఇక, ఎస్పీ చీఫ్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తీవ్ర విమర్శలు గుప్పించారు.
మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య కేసు కూటమి ప్రభుత్వంలో రాజకీయ దుమారం రేపింది. బీడ్ జిల్లాలో డిసెంబర్ 9న సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్(45) హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఫిబ్రవరి 27న పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే సన్నిహితుడి పేరు ఉంది.
BJP: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యవహారం కాంగ్రెస్‌లో కాకరేపుతోంది. ఆయన బీజేపీకి చేరుతారంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనల్ని డీకే శివకుమార్ కొట్టిపారేసినప్పటికీ, సొంత పార్టీలోని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆయన మహా కుంభమేళాకు వెళ్లడం, శివరాత్రి రోజున కోయంబత్తూర్‌లో మతపరమైన కార్యక్రమానికి హాజరుకావడంతో బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదన వినిపిస్తోంది.
Pune Rape Case: పూణే అత్యాచార ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. పూణే నగరం నడిబొడ్డున, పోలీస్ స్టేషన్‌కి 100 మీటర్ల దూరంలో ఉన్న స్వర్గేట్ బస్‌స్టాండ్‌లో నిలిచి ఉన్న బస్సులో 26 ఏళ్ల మహిళపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రామ్‌దాస్ గాడే అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. రాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నవీస్ సర్కార్‌పై కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన విమర్శలు గుప్పిస్తోంది.