Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘లవ్ జిహాద్’’ చట్టం అవసరాన్ని చెప్పారు. దాదాపు లక్ష కేసులు ఈ విధంగా నమోదైనట్లు వెల్లడించారు. ఈ కేసులను మొదట్లో మతాంతర వివాహాలుగా చూసినప్పటికీ, పురుషులు వివాహానికి ముందు తమ గుర్తింపుని దాచిపెట్టి, పిల్లలు పుట్టిన తర్వాత తమ భార్యలను విడిచిపెడుతున్నారని పేర్కొన్నారు. ఈ స్త్రీలలో చాలా మందిని వారి కుటుంబాలు తిరస్కరిస్తున్నాయని, వారి జీవితాలు విధుల పాలవుతున్నాయని అన్నారు.
Read Also: HCL: కూతురు రోష్ని నాడర్‌కి 47% తన వాటాని గిఫ్ట్‌గా ఇచ్చిన శివ్ నాడార్..
ఈ ధోరణి దృష్ట్యా, ఫడ్నవీస్ లవ్ జిహాద్ చట్ట ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సమస్యలపై చర్చిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత గురించి కూడా ఆయన చర్చించారు. తప్పిపోయిన బాలికల గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేసులను త్వరగా పరిష్కరించకపోతే వాటిని మూసివేయవద్దని పోలీసులను ఆదేశించానని అన్నారు.
మతాంతర పెళ్లిళ్లు చెడ్డవి కావని చెబుతూనే, నకిలీ లేదా గుర్తింపును దాచి పెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం, బిడ్డ పుట్టిన తర్వాత వదిలేయడం, మతమార్పిడులు చేయడం వంటికి ఆపాలని సీఎం హెచ్చరించారు. ఇలాంటి కేసుల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఒక చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వ అధికారులు, పోలీసులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. ఇస్లాం మతానికి చెందిన పలువురు దురుద్దేశంతో హిందూ మహిళల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడాన్ని లవ్ జిహాద్‌గా వ్యవహరిస్తున్నారు.