Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది.
శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిపై ఆరోపణలను ధ్రువపరిచే ఆధారాలను ఢిల్లీ పోలీసులు కోర్టులో వెల్లడించారు. ఈ వాదనలో పోలీసులు కీలక విషయాలను తెలిపారు.
Vijay Zol: టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ విజయ్ జోల్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 19మందిపై కిడ్నాప్, దోపిడి, అల్లర్లకు పాల్పడ్డారన్న కారణంతో కేసు నమోదైంది. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విజయ్, అతడి సోదరుడు విక్రమ్‌తో పాటు మొత్తం 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన కొడుకు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాడు కానీ ఎలాంటి తప్పు పని చేయలేదని విజయ్ తండ్రి, సీనియర్ క్రిమినల్ లాయర్…
ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు పేగు తెంచుకుని పుట్టిన పిల్లల విషయంలో వ్యవహరిస్తున్న తీరు తల్లి ప్రేమకు మచ్చ తెచ్చే విధంగా ఉంది. తాజాగా ఇలాంటి తరహా ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Man killed Woman: ఢిల్లీ శ్రద్ధా కేసు మరిచిపోకముందే ఆ తరహా ఘటనలు దేశంలో తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహ జీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం లింగమార్పిడి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 నాటికి వారి ఫిజికల్ టెస్ట్‌ల ప్రమాణాలను రూపొందిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలిపింది.
2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
Cyrus Mistry Accident: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ పై పోలీసులు విచారిస్తున్నారు. అత్యంత పటిష్టమైన, అధునాతన ఫీచర్లు, అత్యంత భద్రతా ప్రమాణాలు పాటించే జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ వంటి కారు ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోవడంతో ఆ కంపెనీకి చెందిన ఓ టీం ప్రమాదంపై విచారణ జరుపుతోంది. కారు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలను సేకరిస్తోంది. ప్రమాదం గురించి మరిన్ని వివరాలు…
Maharashtra Raigad terror boat stir: మహారాష్ట్ర రాయ్గడ్ లో అరేబియా తీరంలో రెండు పడవలు కలకలం సృష్టించాయి. పడవల్లో మారణాయుధాలు, తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరేబియా తీరం హరహరేశ్వర్ తీరంలో ఈ రెండు పడవులను గుర్తించారు. బోట్ లో ఏకే 47 తుపాకులు, బుల్లెట్లు, మరికొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో రాయ్గడ్ జిల్లా వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు పోలీసులు.
మహారాష్ట్రలో రూ. 100 కోట్లు చెల్లిస్తే మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ సోమవారం అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ జరగనున్నదని ఊహాగానాల నేపథ్యంలో ఈ ఘటన వెలుగుచూసింది.