Viral: ఇంట్లో బాత్ రూం లేదా.. రోడ్డుపై స్నానం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇన్‌ఫ్లుయెన్సర్లు చేయరానిపనులు చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మహారాష్ట్రకు చెందినది. ప్రస్తుతం ఎండలు దండికొడుతున్నాయి. ఉదయం 9కాకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయని తెలపడం కోసం వెరైటీగా ఓ జంట విచిత్రంగా ట్రాఫిక్ లో బైక్ పై స్నానం చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఇప్పుడు దాన్ని తలపించేలా.. థానేలో ఓ వ్యక్తి ఇదే విధంగా బైక్ మీద స్నానం చేశాడు. బైక్ పై ఆ వ్యక్తి కూర్చుని ఉండగా.. వెనుక ఓ మహిళ ఓ బకెట్ పట్టుకుని ఉన్నది. ఆ బకెట్‌లో నీళ్లు, ఓ మగ్ ఉన్నది. థానేలో ఓ చోట ట్రాఫిక్ ఏరియాలో వారి బైక్ ఆగి ఉండగా.. ఆమె బకెట్‌లో నుంచి మగ్ తీసి నీరు పైన పోసుకుంది. ఆ తర్వాత మరోసారి మగ్‌లో నీళ్లు ముంచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీళ్లు పోసింది. కార్లు, ఇతర వాహనాలు ఆ రోడ్డులో రద్దీగా కనిపిస్తుండగా వారి బైక్ డ్రైవింగ్ చేస్తుండగా కూడా ఇలాగే ఆమె నీళ్లు పోసింది. ఇద్దరూ నీళ్లు పోసుకుంటూ స్నానం చేశారు.
Read Also:Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం
Also Read
మహారాష్ట్ర థానేలోని ఉల్లాస్‌నగర్‌లో ఈ వీడియో షూట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఇది ఉల్లాస్‌నగర్‌లో సెక్షన్ 17లోని మెయిన్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ వీడియో చూసి మరింత మంది ఇలాంటి నాన్‌సెన్స్ చేయడానికి ముందు వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర పోలీసులను కోరారు. మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చామని, చర్యలు తీసుకుంటారని సమాధానం వచ్చింది. ఈ వీడియోలోని వ్యక్తి పేరు ముంబయికి చెందిన ఆదర్శ్ శుక్లా. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని పోలీసులు వార్నింగ్ ఇవ్వగా ఆయన క్షమాపణలు చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని అన్నారు.
Read Also:Marriage : యువతి పెళ్లి జరుగుతుండగా లవర్ ఎంట్రీ.. మ్యారేజ్ క్యాన్సిల్
@DGPMaharashtra @ThaneCityPolice
This is ulhasnagar, Is such nonsense allowed in name of entertainment? This happened on busy Ulhasnagar Sec-17 main signal.Request to take strict action lncluding deletion of social media contents to avoid others doing more nonsense in public. pic.twitter.com/BcleC95cxa— WeDeserveBetterGovt.🇮🇳 (@ItsAamAadmi) May 15, 2023
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!