Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ల బెడద ఎక్కువయ్యింది. దీనిని నివారించడానికి మహారాష్ట్ర పోలీసులు, ఏటీఎస్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు గట్టి చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూలైలో మొరాదాబాద్ పోలీసులు అక్రమ అంతర్జాతీయ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ను ఛేదించి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను కనిపెట్టి అరెస్టు చేశారు. అయితే తాజాగా థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలోని ఓ భవనంలోని ఐదో అంతస్తులో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉందని సమాచారం వారికి అందింది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు, ఏటీఎస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు పరిగెత్తి భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అతడు మరణించాడు.
Read Also: Sai Dharam Tej: ఒక్క హిట్ కొట్టగానే రెండు సీక్వెల్స్ కి రెడీ…
మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చిన ఫ్లాట్ యజమాని పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ లభించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని థానే పోలీసులు తెలిపారు. కాగా.. గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఈ నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చేవారని మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. వీరు సిమ్ బాక్సుల ద్వారా వీవోఐపీ కాల్స్ ను జీఎస్ ఎం కాల్స్ గా మార్చేవారని చెప్పారు. నిందితులను మహ్మద్ కలీం, అతని సోదరుడు మహ్మద్ మెహరాజ్ గా గుర్తించామని చెప్పారు. వారి నుంచి 550 సిమ్ కార్డులు, రూ.63 వేలు స్వాధీనం చేసుకున్నారు.
Read Also:Puducherry : తాగి వచ్చి కొడుతున్నాడని.. మొగుడిపై కిరోసిన్ పోసి నిప్పంటిన భార్య