మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న…
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఖరారయ్యారు. బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించింది. మోహన్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
BJP Set to choose Madhya Pradesh CM Today: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడు విష్ణుదేవ్ సాయిని బీజేపీ ఆదివారం నియమించింది. రాజస్థాన్ సీఎం ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక మధ్యప్రదేశ్‌కు కొత్త సీఎం ఎవరో నేడు తెలిసిపోనుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలకు గానూ 163 సీట్లలో విజయం…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 66 సీట్లు మాత్రమే పరిమితమైంది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతోంది. మొత్తం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కైవసం చేసుకోగా.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపొందింది.
BJP: 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి సూపర్ కిక్ ఇచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉండటంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కైవసం చేసుకుంది. దీంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలన్నింటిలో బీజేపీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
CM Shivraj Singh Chouhan: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అవినీతి మరక లేకుండా గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అయితే ఎంతటి సీఎం అయిన చాలా హుందాగా, క్షమశిక్షణగా ఉండటం శివరాజ్ సింగ్ నైజం. ఓడిపోయినా, గెలిచినా కూడా తాను ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను మాత్రమే అని చెబుతుంటారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ, బీజేపీ ముఖ్యమంత్రిగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీని…
BJP MPs Resign: 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాషాయ జెండాను ఎగరేసింది. అయితే ఈ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థులను నిర్ణయించే విషయంలో బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న సీఎంలు మార్చి కొత్త ముఖాలను తీసుకురావాలని అనుకుంటున్నట్లు సమాచారం.
INDIA bloc: ఇండియా కూటమి సమావేశానికి తేదీ ఖరారైంది. బుధవారం సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావించినప్పటికీ, పలువురు కీలక నేతలు గైర్హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో తేదీన ఇండియా కూటమి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా డిసెంబర్ 17 కూటమి నేతల భేటీ జరుగుతుందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం తెలిపారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు.
Kamal Nath: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గత 2 దశాబ్ధాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో కొనసాగుతోంది. మరో 5 ఏళ్లు కూడా బీజేపీ అధికారంలో కొనసాగబోతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది. 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 163 స్థానాల్లో గెలవగా.. కాంగ్రెస్ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది.