Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో జరిగింది. అవమానం భరించలేక బాలిక ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దామోహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మైనర్ బాలిక తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు.
‘‘ ఇది మా ఉజ్జయిని సమయం, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కానీ పారిస్ సమయాన్ని నిర్ణయించడం ప్రారంభించింది. గ్రీన్‌విచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా భావించి బ్రిటిషర్లు దీనిని స్వీకరించారు’’ అని ఆయన గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని శతాబ్ధాలుగా రాళ్లను దేవతలుగా పూజిస్తుlన్నారు. అక్కడి ప్రధాన సంప్రదాయాల్లో ఈ రాళ్లకు ప్రత్యేకస్థానం ఉంది. అయితే తాజాగా తేలింది ఏంటంటే.. అసలు ఇవి రాళ్లే కావని, డైనోసార్లకు సంబంధించిన గుడ్లుగా తేలింది. అక్కడి ప్రజలు వీటిని తమ కుటుంబ దేవతలుగా కొన్నేళ్లుగా పూజిస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వచ్చి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఈరోజు అంటే సోమవారం మధ్యప్రదేశ్ 16వ అసెంబ్లీ తొలి సెషన్ కూడా ప్రారంభం కానుంది.
Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రోజు మోహన్ యాదవ్ పదవీ స్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు సీఎం సంచలన ఆదేశాలు జారీ చేశారు. మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
MP : నేటి నుంచి మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Shivraj Singh Chouhan: నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు.