Shivraj Singh Chouhan: నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు. వీడ్కోలు సమయంలో శివరాజ్ సింగ్‌ని పట్టుకుని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం పదవిని విడిచిపెట్టవద్దని ఆయనను కోరారు. మీరంటే అందరికీ ఇష్టమని, మేం మీకే ఓటేశాం అంటూ మహిళలు వాపోయారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌పై డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్‌లకు సూచన..
సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని, మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు. బీజేపీ నాయకత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు. సీఎంకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అతను ప్రవేశపెట్టిన ‘లాడ్లీ బెహనా’ పథకం ఎన్నికల్లో బీజేపీ విజయానికి కారణమైంది. దీని గురించి మాట్లాడుతూ.. మహిళా సాధికారత అనేది నాకు ఓట్లు తెచ్చే పథకం కాదని..బీజేపీ సాధారణ కార్మికులను కూడా ఉద్ధరించే పార్టీ అని అన్నారు.
ఎంపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డ్ సృష్టించారు. 2005-2018 వరకు, 2020-2023 వరకు ఆయన సీఎంగా పనిచేశారు. 1990లో బుద్నీ నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించారు. చౌహాన్ సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు.