Congress: ఓటమి ఫలితం.. కమల్‌నాథ్ స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గా జితూ పట్వారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే తాజాగా శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్‌గా కమల్ నాథ్‌ని తొలగించి, ఆయన స్థానంలో జితూ పట్వారీని నియమించింది. జితు పట్వారినీ తక్షణమే రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి పేరిట ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ అందించిన సేవల్ని పార్టీ అభినందిస్తోందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది. రవ్ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జితు పట్వారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మధు శర్మ చేతిలో ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్‌గా పనిచేశారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Read Also: Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పీసీసీ చీఫ్‌తో పాటు ఉమంగ్ శింగార్‌ని ప్రతిపక్ష నేతగా, హేమంత్ కటారేని మధ్యప్రదేశ్ విధానసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్‌గా నియమించింది.పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్న జితూ పట్వారీ, గతంలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నతవిద్యా, యువజన, క్రీడా మంత్రిగా పనిచేశారు. 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) చీఫ్‌గా కమల్ నాథ్ నియమితులైనప్పుడు, పట్వారీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 230 స్థానాలు ఉన్న ఎంపీ అసెంబ్లీలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంటే.. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్‌ని సీఎంగా చేసింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!