PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి ఈ రోజే చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించాయి. ప్రధాని నరంద్రమోడీ ఈ రోజు బీతుల్ జిల్లా బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. భారీగా హాజరైన జనాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని.. బీజేపీ విజయం ఖాయమైందని అన్నారు.
Cows trample people in Madhya Pradesh’s Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వింత సంప్రదాయం కొనసాగవుతోంది. భక్తులు నేలపై పడుకొని ఆవులతో (గోవులు) తొక్కించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గోవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు అంటున్నారు. తాజాగా భక్తులపై నుంచి ఆవులు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి జనాలకు ఓ హామీ ఇచ్చారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు.
Shivraj Chouhan: మధ్యప్రదేశ్ ఎన్నికలకు కేవలం మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 17న రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దశాబ్ధానికి పైనా పాలిస్తున్న బీజేపీని అధికారంలోకి దించేయాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది.
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా తన ప్రచార దూకుడును పెంచింది. నవంబర్ 17న పోలింగ్ జరగనుంది, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.
PM Modi: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సత్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వస్తే దానితో పాటు విధ్వంసాన్ని తెస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్‌కి రోడ్‌మ్యాప్ లేదని, మోడీ హామీలపై ప్రజలకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు.
CM Nitish Kumar: బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అసెంబ్లీలో జనాభా నియంత్రణ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆయన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న నితీష్ కుమార్.. తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరారు.
Himanta Biswa Sarma: మరోసారి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హిమంత, రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఔరంగజేబు, బాబార్లకు వేసినట్లే అని ఆయన అన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ దాడి చేస్తే దానిపై రాహుల్ గాంధీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని, అయితే అతను ‘ఇండియా హమాస్’ భయపడుతున్నాడని, కానీ ప్రధాని…
PM Modi: జనాభా నియంత్రణ గురించి బీహార్ అసెంబ్లీలో నిన్న సీఎం నితీష్ కుమార్ మాట్లాడటం వివాదాస్పదం అయ్యాయి. మహిళ గౌరవాన్ని దెబ్బతీసేలా నితీష్ వ్యవహరించడంపై పలువురు మహిళా ప్రజాప్రతినిధులతో పాటు విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని ఈ రోజు సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పారు.
Congress: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్‌ని ఆలస్యం చేశారని బీజేపీై ఆరోపణలు గుప్పించారు. జ్యోతిరాదిత్య సింధియా వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 2020లో మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత సీఎం శివరాజ్‌సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.