BJP Set to choose Madhya Pradesh CM Today: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకుడు విష్ణుదేవ్ సాయిని బీజేపీ ఆదివారం నియమించింది. రాజస్థాన్ సీఎం ఎవరనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక మధ్యప్రదేశ్‌కు కొత్త సీఎం ఎవరో నేడు తెలిసిపోనుంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 230 స్థానాలకు గానూ 163 సీట్లలో విజయం సాధించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం సోమవారం సాయంత్రం భోపాల్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని, సీఎం అభ్యర్థి పేరును 7 గంటలకు ప్రకటిస్తారని తెలిసింది. ఈ సమావేశానికి కేంద్ర బీజేపీ పరిశీలకులు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా అధినేత కే లక్ష్మణ్, పార్టీ కార్యదర్శి అశా లక్రా హాజరు కానున్నట్టు సమాచారం. వీరందరూ ఉదయం 11 గంటలకు భోపాల్ చేరుకుంటారని ఓ జాతీయ మీడియా తెలిపింది.
Also Read: Sabarimala Darshan Timings: భక్తులకు శుభవార్త.. మధ్యాహ్నం 3 గంటల నుంచే అయ్యప్ప దర్శనాలు!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎవరినీ ప్రకటించలేదు. డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు వెలువడగా.. సీఎం ఎంపిక విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. సీఎం రేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, ప్రహ్లాద్ పటేల్, నరేంద్రసింగ్ తోమర్, కైలాశ్ విజయవర్గీయ, వీడీ శర్మ ఉన్నారట.