మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనుక నుంచి వచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొంది.
ఈ సంఘటన కట్ని సమీపంలోని పకారియా రైల్వే స్టేషన్ నుండి నివేదించబడింది. కట్నిలోని తన సోదరి ఇంటికి వచ్చినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. అయితే.. తిరిగి తన గ్రామం సత్నాకు వెళ్తుండగా.. DMU రైలు ఎక్కినట్లు తెలపింది. కట్నీ నుంచి పకారియా రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చాలాసేపు ఆగింది. దీంతో బాధితురాలు.. రైలు దిగి వెళ్తుండగా, చాలా సేపటి తర్వాత సత్నాకు వెళ్ళే మరో రైలు వచ్చింది. దీంతో ఆమే ఆ రైలు ఎక్కింది.
Read Also: Jamal Kudu: సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన జమాల్ కుడు సాంగ్ ఎక్కడిదో తెలుసా?
అయితే రైలు ఎక్కిన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళను చూసి కమలేష్ కుష్వాహ అనే వ్యాపారి ఆమేపై కన్నేశాడు. బోగీ మొత్తం ఖాళీగా ఉందన్న విషయాన్ని అవకాశంగా తీసుకుని ముందుగా తలుపులన్నీ మూసేసి ఆ మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బోగీ అంతా ఖాళీగా ఉండడంతో మహిళ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఆ తర్వాత నిందితుడు మహిళను సాత్నా స్టేషన్‌లో దించి మళ్లీ బోగీ తలుపులు మూసుకున్నాడు. ఈ ఘటనపై బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించడంతో.. వారు వెంటనే నిందితుడిని పట్టుకునేందుకు రైలును వెంబడించారు.
ఈ క్రమంలో రైల్వే పోలీసులు.. కైమా రైల్వే స్టేషన్‌కు చేరుకుని నిందితుడు ఉన్న బోగీని తెరవడానికి ప్రయత్నించారు. కాని నిందితుడు తలుపులు తీయకుండా ఉంచాడు. దీంతో రైలు స్టార్ట్ కావడంతో నిందితుడు పట్టుబడలేదు. ఆ తర్వాత GRP పోలీసులు మళ్లీ రైలును వెంబడించి.. రేవా రైల్వే స్టేషన్‌లో తలుపును తెరిచేందుకు సాంకేతిక సిబ్బందిని రప్పించి నిందితుడిని పట్టుకున్నారు. ఆ తర్వాత.. అక్కడికి చేరుకున్న బాధిత మహిళ నిందితుడిని గుర్తించింది. నిందితుడు కమలేష్ కుష్వాహ, యూపీలోని బండా నివాసిగా గుర్తించారు.