మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 13 ఏళ్ల బాలిక మరణించింది. తన ప్రాణాలను కాపాడుకునేందుకు టార్పాలిన్ మీద దూకింది కానీ ఆమె బరువు కారణంగా ప్లాస్టిక్ టార్పాలిన్ చిరిగిపోవడంతో సీసీ రోడ్డు మీద పడిపోవడంతో బలంగా తలకు గాయం కావడంతో ప్రాణాలు కోల్పోయింది.
Indore: మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో షాకింగ్ సంఘటన ఎదురైంది. హోంవర్క్ కారణంగా ఓ విద్యార్థి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇండోర్ లోని నందానగర్ ప్రాంతంలో జీ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు పాఠశాల భవనం మూడో అంతస్తుు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. హోంవర్క్ చేయలేదని ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డాడు.
Girls Missing: మధ్యప్రదేశ్ 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. రాజధాని భోపాల్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ అక్రమ షెల్టర్ హోమ్ నుంచి గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు మిస్సైనట్లు అధికారులు తెలిపారు. బాలికల్లో ఎక్కువగా గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వారు కాగా.. కొందరు మధ్యప్రదేశ్‌లోని సెహోర్, రైసెన్, చింద్వారా, బాలాఘాట్లకు చెందిన వారు ఉన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ కలెక్టర్ తీరు వివాదాస్పదమైంది. ట్రకర్ల నిరసన నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిషోర్ కన్యన్ చేసిన ‘ఔకత్’ (స్థాయి) వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. ట్రక్కర్ల ప్రతినిధిని ఉద్దేశిస్తూ ‘నీ స్థాయి ఎంత’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. కలెక్టర్‌ని పదవి నుంచి తొలగించింది బీజేపీ ప్రభుత్వం. ఇలాంటి వ్యాఖ్యల్ని సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ అన్నారు.
Heart Attack: ఇటీవల కాలంలో చిన్న పిల్లాడి నుంచి యువకుల వరకు పలువురు అకస్మాత్తు గుండెపోటుల వల్ల మరణిస్తున్నారు. 30 ఏళ్లకు దిగువన ఉండే యువకులు కూడా ఇలా ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించాడు. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బల్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కూట్ గ్రామంలో 22 ఏళ్ల ఇందల్ సింగ్ జాదవ్ బంజారా గుండెపోటుకు గురై మరణించాడు.…
ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో బస్సులోని 13 మృతి చెందారు.. అదే విధంగా మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు.. బస్సులో ప్రయాణిస్తున్న మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వివరాల్లోకి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దామోహ్ జిల్లాలో జరిగింది. అవమానం భరించలేక బాలిక ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దామోహ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ గరిమా మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి మైనర్ బాలిక తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయటకు వెళ్లారు.
‘‘ ఇది మా ఉజ్జయిని సమయం, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. కానీ పారిస్ సమయాన్ని నిర్ణయించడం ప్రారంభించింది. గ్రీన్‌విచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా భావించి బ్రిటిషర్లు దీనిని స్వీకరించారు’’ అని ఆయన గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అన్నారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.