జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం…
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
‘మా’ అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. పోటీదారుల ఆరోపణలు, విమర్శలతో ‘మా’ అధ్యక్ష పోరు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈసారి మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి హేమ ఉన్నట్లుండి అధ్యక్షుడు నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జూలై 29వ తేదీ వర్చువల్ మోడ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది. ఇందులో 2021-23కు జరగాల్సిన ఎన్నికలతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆగస్ట్ 22న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని ఈసీ సమావేశం నిర్ణయించింది. అయితే ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ కొన్ని మీడియా సంస్థలలో ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగబోతున్నాయంటూ వార్తలు రావడాన్ని’మా’ కార్యవర్గం తప్పు పట్టింది. అలాంటి నిర్ణయం ఈసీ…
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉంది. ఈ యేడాది మార్చి నాటికే ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి పూర్తయిపోయింది. అయితే కరోనాతో పాటు అక్కౌంట్స్ నూ ఓ కొలిక్కి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఆ మధ్య సర్వసభ్య సమావేశం పెట్టి ఇకపై ఎన్నికలను సెప్టెంబర్ లో జరపాలని తీర్మానం చేశారు. ఇది ఎంతవరకూ చెల్లుతుందనే విషయాన్ని పక్కన పెట్టితే…. సెప్టెంబర్ లో కూడా ‘మా’ ఎన్నికలు జరగకుండా, మరికొంత కాలానికి వాయిదా వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలకు ఇంకా సమయం వున్నా.. ఇప్పటినుంచే రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదివరకు ఎన్నికల్లో స్పందించని నటీనటులు సైతం ఈసారి దూకుడు పెంచారు. అయితే.. తాజాగా ఈ ఎన్నికలపై నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పట్టించుకోననని తెలిపారు. మనది గ్లామర్ ఇండస్ట్రీ.. మన సమస్యల్ని బహిరంగంగా చర్చించడం సరికాదన్నారు. తెలంగాణ సర్కార్ తో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ‘మా’కు శాశ్వత…
‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. Read Also:…