‘మా’భవన నిర్మాణంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్ ఉంది: నాగబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కోసం ఒకప్పటి అధ్యక్షుడు మురళీమోహన్ ఎంతో ప్రయత్నించారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది సఫలం కాలేదన్నారు. ఆయన తర్వాత వచ్చినవాళ్లు కూడా ఎన్నో సార్లు ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాలనుకున్నారు. అయితే సభ్యుల సంక్షేమం, ఇతర కారణాలపై దృష్టి సారించడం వల్ల.. ఇప్పటికీ అది వీలు కాలేదు.
భవన నిర్మాణం, నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్ ఉందన్నారు. ‘మా’ అసోసియేషన్ వృద్ధికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేదానిపై ఆయనకు ప్లానింగ్ ఉంది. అందుకే నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నానని తెలిపారు. ‘మా’ కోసం ఇప్పటివరకూ కొంతమంది అధ్యక్షులు విరాళాలు సేకరించిన మాట వాస్తవమే.. అవి ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం సేకరించారన్నారు.
Also Read
‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటున్న మంచు విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఏకగ్రీవం చేయాలనుకుంటే.. పోటీలో నిలబడిన వాళ్లందరూ తప్పుకుని ప్రకాశ్‌రాజ్‌ని అధ్యక్షుడిని చేయవచ్చు కదా..!? నా దృష్టిలో ఏకగ్రీవం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఏ అంశంలోనైనా పోటీ ఉండాలి.. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ అయి ఉండాలన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అందరూ కలిసి పనిచేస్తే… మరింత అభివృద్ధి సాధించవచ్చు అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!