మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలతో పాటు నాగబాబు రాజీనామాను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ తిరస్కరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. విష్ణు ప్యానెల్, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఎట్టకేలకు విష్ణు మంచు అండ్…
‘మా’ ఎన్నికల వివాదం ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలతో మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏపీ రౌడీ షీటర్లు ఓటర్లను బెదిరించారని, ఓట్ల లెక్కింపు సమయంలో నూకల సాంబశివరావు అనే రౌడీషీటర్ కౌంటింగ్ హాల్ లోనే ఉన్నాడని, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో అతనిపై రౌడీ షీట్ తో పాటు హత్య కేసు కూడా ఉందని, ముగ్గురు ఎస్ఐలను కొట్టాడని ఆరోపించారు ప్రకాష్ రాజ్. ఈ నెల 14వ తేదీన ఈ విషయంపై ఎన్నికల…
‘మా’ ఎన్నికల వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ‘మా’లో మొదటి నుంచీ మాటల యుద్ధాలు, తూటాలు పేలుతూ వచ్చాయి. అయితే ఎన్నికల తరువాత అంతా చల్లబడుతుందని భావించారు. కానీ ఈ వివాదం సద్దుమణగడం మాట అటుంచి, రోజురోజుకూ మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే ‘మా’ ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు బృందం ప్రమాణ స్వీకారం చేసి ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. మంచు విష్ణు ప్యానల్ గెలిచిందని ప్రకటించిన మరుసటి రోజే రాజీనామాల పర్వం మొదలైంది.…
గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు,మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు పెట్టడం జరిగింది. ఆయన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల్ల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి..ఏమిటీ గొడవలు..ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ,ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది..అతనూ చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మా…
‘మా’ ఎన్నికల వివాదంలో సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారింది. ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎన్నికల సమయంలో తమపై దౌర్జన్యం చేశారని, దాడి చేశారని ఆరోపిస్తూ ‘మా’ ఎన్నికలపై కోర్టుకు వెళ్తామని, అయితే అంతకన్నా ముందు సీసీటీవీ ఫుటేజ్ చూస్తామని కోరుతూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. అయితే కృష్ణమోహన్ మాత్రం దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని ఎవరు పడితే వాళ్ళు అడిగితే సీసీటీవీ ఫుటేజ్ చూపించలేమని అన్నట్లు ప్రకాష్ రాజ్…
‘మా’ ఎలక్షన్స్ లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం కూడా అయిపొయింది. ఈ నేపథ్యంలో తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా దీనికి నిదర్శనం. చిరంజీవి తనను ‘మా’ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలగమని అడిగారంటూ విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఈ…
‘మా’ కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు, అతని ప్యానెల్ సోమవారం ఉదయం తిరుమలను సందర్శించి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. విఐపి దర్శనం సమయంలో విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన సోదరి లక్ష్మి మంచుతో పాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుతం వివాదాస్పదమైన సీసీటీవీ ఫుటేజ్ గురించి స్పందించారు. Read Also : “అలయ్ బలయ్”లో నేను, పవన్ మాట్లాడుకున్నాము : మంచు విష్ణు…
‘మా’ ఎలక్షన్లు ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరోవైపు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ‘మా’ ఎన్నికల సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా…
మా ఎన్నికలు చాలా నిజాయితీగా నిర్వహించాం అని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. సీసీ ఫుటేజ్ కావాలని అడిగారు.. కానీ నిబంధనల ప్రకారమే ఇస్తాం. సీసీ ఫుటేజ్ చాలా మంది అడిగారు. ఇవ్వడం మొదలు పెడితే ఎంతమందికి ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఇక ఎన్నికల పోలింగ్ ఫలితాల పై లిఖితపూర్వక ఫిర్యాదులు మాకు అందలేదు అని చెప్పిన ప్రకాష్ రాజ్, మంచి విష్ణు ఆమోదంతోనే తర్వాత రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఇక తాను…
శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసిన దృష్ట్యా ఇక పై తాను, తన కమిటీ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను గెలవాలని కొందరు పూజలు చేశారని, వాటిని…