మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) జూలై 29వ తేదీ వర్చువల్ మోడ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను నిర్వహించింది. ఇందులో 2021-23కు జరగాల్సిన ఎన్నికలతో పాటు పలు అంశాలను చర్చించారు. ఆగస్ట్ 22న వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని ఈసీ సమావేశం నిర్ణయించింది. అయితే ఎన్నికలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. కానీ కొన్ని మీడియా సంస్థలలో ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్ 12న జరుగబోతున్నాయంటూ వార్తలు రావడాన్ని’మా’ కార్యవర్గం తప్పు పట్టింది. అలాంటి నిర్ణయం ఈసీ మీటింగ్ లో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలానే ‘మా’ ఉపాధ్యక్ష పదవికి గతంలో డా. రాజశేఖర్ రాజీనామా చేశారు. దానిని క్రమశిక్షణ సంఘం ఆమోదించింది. ‘మా’లో ఐక్యత, సద్భావనలను పెంపొందించడం కోసం దాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇసీ సమావేశం కోరింది. ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్ట్ అసియేషన్ తాజాగా ఓ ప్రకటన ద్వారా తెలియచేసింది.
Read Also : పొట్టి డ్రస్ లో జాన్వీ… ఫిదా అయిపోయిన మరో బాలీవుడ్ ‘తార’!