మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకీ ఎన్నడూ లేనంతగా చర్చలకు తెరలేపుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం వున్నా అప్పుడే ‘మా’లో రచ్చ మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు సుమన్ ‘మా’ ఎన్నికల వ్యవహారంపై స్పందించారు. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమని ఆయన అన్నారు. ఆ భావననే వైద్యులకు, రైతులకు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండంటూ కోరారు.…
టాలీవుడ్ లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న మెగా బ్రదర్ నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ తో పాటు పలువురు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలియజేస్తూ మాట్లాడారు. అయితే.. తాజాగా ఈరోజు సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్.. ప్రకాష్ రాజ్ టీమ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ‘మా’ తరపున మేం చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెపుతునే వస్తున్నాం. అయినా కూడా నాలుగేళ్లుగా ‘మా’ మసకబారిపోయిందని…