Pratima Bhoumik Gives Clarity On 50 Percent Reservation To OBC: విద్య, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించలేమని సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ రాజ్యసభలో స్పష్టం చేశారు. బుధవారం ఎంపీ విజయసాయి రెడ్డి సంధించిన ప్రశ్నకు ఆమె ఈ జవాబు ఇచ్చారు. ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని క్లారిటీ ఇచ్చారు. ‘‘ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా? ఒకవేళ పరిగణనలోకి తీసుకున్న పక్షంలో, ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇందుకు మంత్రి ప్రతిమా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి.. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్ కల్పించాలని.. దేశవ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని ఆమె తెలిపారు.
Ban on TikTok: గూఢచర్యం భయం..! టిక్‌టాక్‌పై అగ్రరాజ్యం బ్యాన్
గత నెలలో చదువు, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సరైనదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్‌ను సడలిస్తారా? ఓబీసీ కోటా పెంచుతారా? అంటూ లోక్‌సభలోనూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు.. ప్రస్తుతమున్న రిజర్వేషన్ స్కీమ్‌ను మార్చే ప్రతిపాదన ఏదీ లేదని ప్రతిమా భౌమిక్ స్పష్టం చేశారు.
Crime News: హర్యానాలో శ్రద్ధా వాకర్ లాంటి ఘటన.. ట్రాలీబ్యాగ్‌లో కుళ్లిపోయిన మృతదేహం